వాట్సప్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న యూజర్‌నేమ్ ఫీచర్‌ను విడుదల చేసింది. దీని ద్వారా వినియోగదారులు తమ ఫోన్ నంబర్‌ను ఇతరులతో పంచుకోకుండానే సందేశాలు పంపవచ్చు లేదా కాల్స్ చేయవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం పరిమిత సంఖ్యలో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది, దశలవారీగా అందరికీ విస్తరించనుంది. యూజర్‌నేమ్ కనీసం 3 అక్షరాల నుంచి 35 అక్షరాల వరకు ఉండాలి, ఇందులో అక్షరాలు, అంకెలు, డాట్, అండర్‌స్కోర్ మాత్రమే వాడాలి. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో వాడుతున్న యూజర్‌నేమ్‌నే వాట్సప్‌లో వాడాలనుకుంటే ఖాతాలను లింక్ చేసుకోవాలి. ఈ ఫీచర్‌ను ప్రొఫైల్ సెట్టింగ్స్‌లో చెక్ చేసుకోవచ్చు.