హైదరాబాద్‌లో కొత్త ఫ్లైఓవర్.. ట్రాఫిక్ కష్టాలకు చెక్

9675చూసినవారు
హైదరాబాద్‌లో కొత్త ఫ్లైఓవర్.. ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు హెచ్ఎండీఏ మరో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని యోచిస్తోంది. బంజారాహిల్స్ జీవీకే మాల్ నుంచి మాసబ్ ట్యాంక్ మీదుగా పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేను కలిపే ఈ 3 కిలోమీటర్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రైవేట్ కన్సల్టెన్సీకి బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వం ఆమోదిస్తే రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే సిటీ సెంటర్ నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లేవారికి, మాసబ్ ట్యాంక్, మెహిదీపట్నం వైపు వెళ్లేవారికి ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయి. మాసాబ్ ట్యాంక్ వద్ద అండర్ పాస్ కూడా నిర్మించనున్నారు.

సంబంధిత పోస్ట్