ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి కొత్త ఆదాయ పన్ను చట్టం

8296చూసినవారు
ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆదాయ పన్ను వ్యవస్థను మరింత సరళతరం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పన్ను చెల్లింపుదారులకు అనుకూలంగా నిబంధనల్లో సడలింపులు చేశామని, సామాన్యులకు భారీ ఉపశమనం కలిగే అవకాశం ఉందన్నారు. సరళతరం చేసిన కొత్త ఫారాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్