ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమలులోకి రానుంది. సామాన్యులు సైతం సులభంగా ఫైల్ చేసేలా పన్ను ఫారాలను సరళతరం చేశారు. రహదారి ప్రమాదాల పరిహారంపై వడ్డీకి పన్ను మినహాయింపు లభించనుంది. సవరించిన పన్ను రిటర్నుల దాఖలు గడువును డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు పొడిగించారు. విదేశీ యాత్రలపై పన్ను తగ్గనుంది. చదువులు, వైద్యంపై టీసీఎస్ 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గింది. మ్యాన్‌పవర్ సరఫరా చేసే సంస్థలపై టీడీఎస్ కూడా తగ్గనుంది.