AP: కూటమి ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తీసుకునేలా కొత్త చట్టం త్వరలో అమల్లోకి తీసుకురానుంది. దీనికి సంబంధించి మంత్రులు అనిత, నాదెండ్ల మనోహర్, పార్థసారధి, అనగాని సత్యప్రసాద్ లతో మంత్రి వర్గ కమిటీ ఏర్పాటు చేసింది. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టె వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, కొత్త చట్టాలపై సబ్ కమిటీ చర్చించనుంది.