AP: ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మంత్రి లోకేష్ నేతృత్వంలో తెలుగుదేశం మంత్రుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "తొలిసారి గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలకు మంచిచెడులు తెలియట్లేదు. అవగాహన రాహిత్యంతో, అనుభవం లేక కొందరికి సమన్వయం ఉండట్లేదు. తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు సీనియర్లతో అవగాహన కల్పించాలి" అని అన్నారు. నవంబర్ 14,15న జరిగే విశాఖ సదస్సుని విజయవంతం చేయాలని లోకేష్ పిలుపునిచ్చారు.