AP: రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 8,190 మందికి స్పౌజ్ పెన్షన్లు అందజేశామని మంత్రి సవిత తెలిపారు. అనంతపురం జిల్లాలోని సానిపల్లిలో లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి పెన్షన్లను మంత్రి సవిత పంపిణీ చేశారు. జిల్లాలో 435 మందికి, పెనుకొండలో 56 మందికి స్పౌజ్ పెన్షన్లు పంపిణీ చేశామన్నారు. ఇంకా అర్హులున్నారని, వారందరికీ త్వరలో అందజేస్తామని తెలిపారు. పెన్షన్లతో పాటు ఇళ్లులేని పేదలకు సొంతిల్లు కట్టించి ఇస్తామని, నూతన రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు.