ఏపీ ప్రభుత్వం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 12వ తేదీ నుంచి ఐదు రకాల పింఛన్లకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, దివ్యాంగులకు కొత్త పింఛన్లు మంజూరు కానున్నాయి. దరఖాస్తుదారులు ఆధార్ నెంబర్, ఆధార్‌తో అనుసంధానించిన ఫోన్ నెంబర్, రేషన్ కార్డ్, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. వృద్ధాప్య పింఛన్‌కు 60 ఏళ్లు దాటినట్లు, వితంతు పింఛన్‌కు భర్త మరణించినట్లు, ఒంటరి మహిళకు విడాకుల పత్రం, దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ జత చేయాలి.