ఏపీలో అక్టోబర్
1 నుంచి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ విధానంలో కీలక మార్పులు రానున్నాయి. జాతీయ సామాజిక సహాయ కార్యక
్రమం (NSAP) కింద కే
ంద్ర వాటా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది. వృద్ధులు, ఒంటరి మహిళలకు రూ.
4 వేల పింఛన్లో కేంద్రం వాటా రూ.200, దివ్యాంగుల
కు రూ.6 వేల పింఛన్లో కేంద్రం వాటా రూ.300 చొప్పున బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి. కేంద్ర ప్రాయోజిత ప
థకాల నిధులను నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేయాలనే కేంద్ర నిబంధనల మేరకు ఈ మార్పులు అమల్లోకి వస్తున్నాయి.