ఏపీలో కొత్త రైల్వే స్టేషన్ రెడీ

16చూసినవారు
ఏపీలో కొత్త రైల్వే స్టేషన్ రెడీ
AP: పశ్చిమ ప్రకాశం, మార్కాపురం జిల్లాలోని కనిగిరి ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం త్వరలో నెరవేరనుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైలు సౌకర్యం అందుబాటులోకి రానుంది. గుంటూరు నుంచి కనిగిరి వరకు ప్యాసింజర్ రైలును నడిపేందుకు రైల్వే అధికారులకు ప్రతిపాదనలు పంపారు. వారంలో ఆరు రోజులు రైలు నడిపేలా ప్రతిపాదనలు రూపొందించారు. రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్