ఉపాధి హామీ పథకంలో అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. మార్చి 2వ తేదీ నుంచి ఉపాధి కూలీలకు ఫేషియల్ అథెంటికేషన్‌ను తప్పనిసరి చేసింది. ఈ కొత్త విధానం రాష్ట్రంలోను అమలు కానుంది. ముఖ హాజరు నమోదు చేసుకోని కూలీలకు బిల్లులు జమ కావు. అలాగే, ఉపాధి హామీ కూలీలందరూ తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.