పాన్ కార్డు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం కీలక నిబంధనలను అమలు చేస్తోంది. రూ.20 లక్షలకుపైగా ఆస్తుల కొనుగోలు, అమ్మకాలు, రూ.2 లక్షలకుపైగా విలువైన వస్తువులు లేదా సేవల కొనుగోలు, రూ.1 లక్షకుపైగా షేర్ల లావాదేవీలు, రూ.5 లక్షలకుపైగా విలువైన కారు లేదా బైక్ కొనుగోలు, డీమ్యాట్ ఖాతా ప్రారంభం వంటి లావాదేవీలకు పాన్ తప్పనిసరి చేసింది. పాన్ వివరాలు ఇవ్వకపోతే లావాదేవీలు ప్రాసెస్ కావు. తప్పుడు లేదా నకిలీ పాన్ వివరాలు సమర్పిస్తే రూ.10 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. పాన్ ఆధారంగా ఆదాయపు పన్ను శాఖ ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షిస్తుంది.