ఐపీఎల్‌లో ఆటగాళ్ల ప్రవర్తనను మెరుగుపరిచేందుకు నిర్వాహక కమిటీ కొత్త నిబంధనలను ప్రకటించింది. ఇకపై టీమ్ షీట్‌లో ఉన్న 16 మంది ఆటగాళ్లకు మాత్రమే మైదానంలోకి ప్రవేశం ఉంటుంది. మిగతా ఆటగాళ్లు డ్రింక్స్, బ్యాట్లు, ఇతర వస్తువులు తీసుకురాకూడదని, బౌండరీ చుట్టూ ఐదుగురికి మించి బెంచ్ ప్లేయర్లు ఉండకూడదని స్పష్టం చేసింది. క్రీడా స్ఫూర్తిని దెబ్బతీసే ప్రవర్తనను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిబంధనలను అతిక్రమించిన వారిపై తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.