కేంద్ర ప్రభుత్వం సామాజిక భద్రత కోడ్ కింద EPF-2026, ఉద్యోగుల పింఛను పథకం-2026, ఉద్యోగుల డిపాజిట్ బీమా పథకం-2026లను అమల్లోకి తెచ్చింది. ఈపీఎఫ్-1952, ఈపీఎస్-1995, ఈడీఎల్‌ఐ-1976 స్థానంలో వచ్చిన ఈ కొత్త పథకాలతో, పీఎఫ్ నుంచి ఏడాదికి రెండుసార్ల కంటే ఎక్కువ పాక్షిక ఉపసంహరణలు చేయకుండా నిబంధనలు కఠినతరం చేశారు. అనారోగ్యం కోసం ఏడాదికి రెండుసార్లు, విద్య కోసం సర్వీసు మొత్తంలో పదిసార్లు, గృహ కొనుగోలు, నిర్మాణం, మరమ్మతులు, ఇంటిరుణం చెల్లింపుల కోసం సర్వీసులో ఐదుసార్లు ఉపసంహరించుకునే అవకాశం కల్పించారు.