AP: ఇకపై రేషన్ కార్డుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన అవసరం లేదు. కూటమి ప్రభుత్వం ఈ ఇబ్బందులను తొలగించడానికి చర్యలు చేపట్టింది. సచివాలయాల్లో రేషన్ కార్డు కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునేలా కొత్త వ్యవస్థను అమల్లోకి తెచ్చింది. డిజిటల్ సహాయకులకు ఈ బాధ్యతలు అప్పగించారు. జనవరి నుంచి జూన్ వరకు దరఖాస్తు చేసుకున్న వారికి జులైలో, జులై నుంచి డిసెంబర్ వరకు దరఖాస్తు చేసుకున్న వారికి జనవరిలో కొత్త రేషన్ కార్డులు అందించనున్నారు.