వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం కేసులో కొత్త ట్విస్ట్

22చూసినవారు
AP: నంద్యాల వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. నిందితుడు జంబులయ్య భార్య బాలమ్మ, తాము మొదటి నుంచే వైసీపీ మద్దతుదారులమని, వైసీపీ కౌన్సిలర్ పున్నా శేషయ్య సహకారంతో ఉద్యోగం వచ్చిందని పేర్కొంటూ ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోతో విగ్రహం ధ్వంసం ఘటనపై వైసీపీ చేస్తున్న ఆరోపణలపై కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన వెనుక రాజకీయ కుట్ర ఉందా అనే చర్చ జరుగుతోంది. బాలమ్మ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్