నాలుగో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారత్‌కు 216 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. టిమ్ షిఫెర్ట్ 62 పరుగులతో అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించగా, డేవన్ కాన్వే 44, డారిల్ మిచెల్ 39, గ్లెన్ ఫిలిప్స్ 24 పరుగులు చేశారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు తీయగా, జస్ప్రీత్ బుమ్రా, రవి బిష్ణోయ్ చెరో వికెట్ సాధించారు.