AP: అనంతపురం జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. రాయదుర్గంలోని చంద్రబాబు నాయుడు కాలనీలో అప్పుడే పుట్టిన పసికందును కంపచెట్టుపై వదిలేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. స్థానికుల సమాచారంతో పోలీసులు, ఆరోగ్య శాఖ అధికారులు చేరుకుని శిశువును కాపాడారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.