నిహారిక-రాఘవ్ ప్రేమాయణం.. నిజమా? సినిమా ప్రచారమా?

15948చూసినవారు
నిహారిక-రాఘవ్ ప్రేమాయణం.. నిజమా? సినిమా ప్రచారమా?
డిజిటల్ ఇన్‌ఫ్లుయెన్సర్ నిహారిక, బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ ప్రేమలో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోమవారం ఇద్దరూ షేర్ చేసిన క్లోజ్ ఫొటోలు, ఒకరినొకరు హగ్ చేసుకుంటున్న చిత్రాలు అభిమానులను ఆనందంలో ముంచెత్తాయి. అయితే, ఇది నిజమైన ప్రేమనా లేక త్వరలో రాబోయే 'భాయ్ తేరా స్టార్ హై' అనే బాలీవుడ్ సినిమా ప్రచారమా అనే సస్పెన్స్ నెలకొంది. రాఘవ్ జుయల్ 'కిల్' సినిమాతో పాటు ఆర్యన్ ఖాన్ వెబ్ సిరీస్‌లోనూ నటించారు. నిహారిక తెలుగు, తమిళ సినిమాల్లోనూ నటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్