చరిత్ర సృష్టించిన నిర్మలా సీతారామన్.. వరుసగా 9వ బడ్జెట్ ప్రవేశం

4259చూసినవారు
చరిత్ర సృష్టించిన నిర్మలా సీతారామన్.. వరుసగా 9వ బడ్జెట్ ప్రవేశం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం భారత పార్లమెంటులో వరుసగా 9వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దీంతో ఆమె దేశ చరిత్రలో వరుసగా ఇన్నిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక ఆర్థిక మంత్రిగా రికార్డు సృష్టించారు. ఒకే ప్రధాన మంత్రి (నరేంద్ర మోదీ) హయాంలో వరుసగా 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా కూడా ఆమె సరికొత్త చరిత్ర లిఖించారు. గతంలో మొరార్జీ దేశాయ్ 10 సార్లు, పి. చిదంబరం 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ, వారు వేర్వేరు ప్రధానుల దగ్గర లేదా వేర్వేరు విడతలుగా పనిచేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్