కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న వరుసగా తొమ్మిదవ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టి కొత్త చరిత్ర సృష్టించనున్నారు. ఈ సందర్భంగా అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టిన నేతల జాబితాలో ఆమె మరో అడుగు ముందుకు వేయనున్నారు. ఇప్పటివరకు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ అత్యధికంగా 10 బడ్జెట్లు ప్రవేశపెట్టి రికార్డు నెలకొల్పారు. ఆయన 1959–1964 మధ్య ఆర్థిక మంత్రిగా 6 బడ్జెట్లు, 1967–1969 మధ్య మరో 4 బడ్జెట్లు సమర్పించారు. ఆ రికార్డుకు నిర్మలా సీతారామన్ చేరువ కావడం విశేషంగా మారింది.