నీతా అంబానీకి అమెరికాలో విశిష్ట గౌరవం

3633చూసినవారు
నీతా అంబానీకి అమెరికాలో విశిష్ట గౌరవం
రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీకి అమెరికాలోని టాంపా నగరంలో రెండు ప్రతిష్టాత్మక పురస్కారాలు లభించాయి. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (AAPI) ఆమెకు హ్యూమానిటేరియన్ అవార్డును ప్రదానం చేసింది. విద్య, ఆరోగ్యం, సామాజిక సేవ రంగాల్లో ఆమె చేసిన అసాధారణ సేవలకు గాను ఈ పురస్కారం దక్కింది. అలాగే, టాంపా మేయర్ జేన్ కాస్టర్, నీతా అంబానీకి 'కీ టు ది సిటీ ఆఫ్ టాంపా'ను బహూకరించారు. ఇది అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పౌర పురస్కారాలలో ఒకటి.

సంబంధిత పోస్ట్