బిహార్ రాజకీయాల్లో నితీష్ కుమార్ హవా కొనసాగే అవకాశం ఉందని, మరో ఆరు నెలలు ఆయన సీఎంగానే ఉంటారని మంత్రి శ్రావణ్ కుమార్ తెలిపారు. రాజ్యసభకు ఎన్నికైన నితీష్, తన లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. నిబంధనల ప్రకారం, ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ పదవి లేకపోయినా గరిష్టంగా ఆరు నెలలపాటు సీఎం పదవిలో కొనసాగే అవకాశం ఉంది. నితీష్ తనయుడు నిశాంత్ సీఎం పదవి చేపట్టడాన్ని కొట్టిపారేయలేమని, అయితే తుది నిర్ణయం నితీష్‌తోపాటు పార్టీ వర్గాలు తీసుకుంటాయని శ్రావణ్ కుమార్ వెల్లడించారు.