జులై-సెప్టెంబరు త్రైమాసికానికి సంబంధించి చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం, సుకన్య సమృద్ధి యోజనపై 8.20%, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)పై)7.10%), మంత్లీ సేవింగ్స్ స్కీమ్‌పై (7.4%), కిసాన్ వికాస్ పత్రపై (7.5%)తో పాటు పోస్టల్ మూడేళ్ల టైమ్ డిపాజిట్‌పై (7.1%) వడ్డీ యథాతథంగా కొనసాగనుంది. ఈ నిర్ణయం పొదుపుదారులకు ఊరట కలిగించింది.