రిజర్వ్ బ్యాంక్ ఆఫ్
ఇండియా (RBI) కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం తెలిపారు. రెపో రేటు 5.25% వద్దే కొనసాగుతుంది. ఇది 2026-27 ఆర్థిక సంవత్సరానికి RBI నిర్వహించిన తొలి ద్వైమాసిక సమీక్ష, గత ఫిబ్రవరి సమీక్షలో కూడా వడ్డీరేట్లలో మార్పు చేయలేదు. అయితే, గత ఏడాదిలో RBI పలుమార్లు వడ్డీరేట్లను తగ్గించింది. మొత్తం రెపో రేటు 1.25% వరకు తగ్గింది. తాజా నిర్ణయం వల్ల హోమ్ లోన్, పర్సనల్ లోన్ తీసుకున్న వారికి EMIలలో పెద్దగా మార్పులు ఉండవు.