సేంద్రియ వ్యవసాయం వైపు మారండి: చంద్రబాబు

7528చూసినవారు
సేంద్రియ వ్యవసాయం వైపు మారండి: చంద్రబాబు
AP: రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, సేంద్రియ వ్యవసాయంపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. విజయవాడలో ఆచార్య ఎన్.జి. రంగా జయంతి సందర్భంగా మాట్లాడుతూ, కొన్ని దేశాలు రసాయన ఎరువులతో పండించిన పంటలను దిగుమతి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాయని, ఇది ఎగుమతులకు ఆటంకం కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన నిలుస్తుందని, గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలు అందిస్తున్నామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్