AP: ఈ నెల 18న నెల్లూరు మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనుండటంతో క్యాంపు రాజకీయాలు షురూ అయ్యాయి. కార్పొరేటర్లను గోవాకు తరలించేందుకు టీడీపీ ప్లాన్ చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. గత ఎన్నికల్లో మొత్తం 54 కార్పొరేటర్ల స్థానాల్లో వైసీపీ గెలవగా.. తర్వాత మెజారిటీ సభ్యులు టీడీపీలో చేరారు. తాజాగా ఐదుగురు తిరిగి వైసీపీ గూటికి చేరడంతో ఆ పార్టీ బలం 16కు చేరింది. దాంతో టీడీపీ అప్రమత్తమైంది.