ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉండదు: వాతావరణ శాఖ

3347చూసినవారు
ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉండదు: వాతావరణ శాఖ
ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం లేదని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశం నిర్మలంగా ఉంటుందని, గాలిలో తేమ ఎక్కువగా ఉన్నందున టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉందని తెలిపింది. రాత్రి ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని అంచనా.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్