జగన్‌ ఎన్ని నాటకాలు ఆడినా ఏపీ అభివృద్ధి ఆగదు: ఎంపీ సీఎం రమేశ్‌

6631చూసినవారు
జగన్‌ ఎన్ని నాటకాలు ఆడినా ఏపీ అభివృద్ధి ఆగదు: ఎంపీ సీఎం రమేశ్‌
AP: BJP MP సీఎం రమేశ్‌ అనకాపల్లిలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో జగన్‌పై విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్‌ ఇప్పుడు ప్రతిపక్షంలోనూ అదే తీరు కొనసాగిస్తున్నారని, మెడికల్‌ కాలేజీల PPP విధానంపై అవగాహన లేకుండా రాద్ధాంతం చేస్తున్నారని, జగన్‌ హయాంలోనే టెండర్ల పేరుతో అవినీతి జరిగిందని ఆరోపించారు. ‘‘ జగన్‌ ఎన్ని నాటకాలు ఆడినా ఏపీ అభివృద్ధి ఆగదు. మోదీ, చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ నేతృత్వంలో ఏపీ అభివృద్ధి పథంలో సాగుతోంది’’ అని అన్నారు.