AP: రాష్ట్ర కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వై.ఎస్. జగన్‌ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదని తెలిపారు. డీఎస్సీ ద్వారా 16వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయగా, దానిపై
జగన్ రాద్ధాంతం చేశారని మండిపడ్డారు. ప్రజలను అయోమయానికి గురిచేయాలని చూశారని, అయితే గట్టిగా తిప్పికొడితే వెనక్కి తగ్గినట్లు తెలిపారు. రాజధాని రైతులను గందరగోళంలోకి నెట్టాలని చూసినా, వారు
జగన్ మనస్తత్వాన్ని అర్థం చేసుకున్నారని, ఆయన మాటలను ఎవరూ నమ్మే స్థితిలో లేరని చంద్రబాబు అన్నారు.