అమరావతిని ఎవరూ టచ్‌ చేయలేరు: చంద్రబాబు

5చూసినవారు
AP: గత ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగిన అరాచక పాలనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా విరుచుకుపడ్డారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి విధ్వంసకర మనస్తత్వం ఉన్న వ్యక్తిని చూడలేదని జగన్‌ను ఉద్దేశించి మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి గౌరవం దక్కుతోందని, పార్లమెంటులో బిల్లుపై చర్చ జరగడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. రాజధానిపై అవాకులు చవాకులు పేల్చే వారికి ఈ చట్టబద్ధతే గట్టి సమాధానం అవుతుందని, రాజధానిని ఇక ఇంచు కూడా కదల్చలేరని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్