తల్లికి వందనం పథకంపై మాజీ సీఎం జగన్ సహా వైసీపీ మూకలు దుష్ప్రచారం చేస్తున్నాయంటూ స్వచ్ఛాధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి బిడ్డకు తల్లికి వందనం అమలు చేస్తూ తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేసిందన్నారు. లోకేశ్ సవాలును ఎదుర్కొనే ధైర్యం వైసీపీలో ఎవరికీ లేదన్నారు. ఆరోపణలు నిరూపించలేక పారిపోయారని, ఇప్పుడు వారు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సిందేనన్నారు.