AP:
వైసీపీ నేతలు, కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికలపై మాజీ మంత్రి కొడాలి నాని కీలక సూచనలు చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ‘స్థానిక ఎన్నికలకు ఎవరూ భయపడకండి. మహా అయితే 2, 3 నెలలు జైళ్లకు పంపుతారు. వెళ్లొద్దాం.. ఎవరూ భయపడకండి. చంద్రబాబు సూపర్ సిక్స్‌ను సూపర్ సున్నా చేశారు. ప్రతి మహిళకు రూ.1,500 ఇస్తానన్నారు.. ఇచ్చారా? నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు.. ఇచ్చారు? ఏ హామీని నెరవేర్చారు? ప్రతి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం. అధైర్యపడకండి’ అని అన్నారు.