మాజీ సీఎం జగన్ రోడ్డుపై కూర్చుని ప్రతిపక్ష హోదా కోసం అభ్యర్థిస్తున్నట్లుగా సృష్టించిన AI వీడియోపై మంత్రి లోకేశ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ శ్రేణులను ఉద్దేశించి, విమర్శలు హుందాగా ఉండాలని, వ్యక్తిగత దాడులు ఎప్పుడూ ఆమోదయోగ్యం కాదని ఆయన సున్నితంగా హెచ్చరించారు. రాజకీయ ప్రత్యర్థులపై కూడా గౌరవంగానే విమర్శలు చేయాలని, ఇలాంటి పనులు చేయొద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నట్లు లోకేశ్ ట్వీట్ చేశారు.