AP: ఆర్టీసీ ప్రైవేటీకరణ, డీజిల్ ధరల కారణంగా టికెట్ రేట్లు పెరుగుతాయనే వార్తలను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఖండించారు. ఆర్టీసీ ఆర్థికంగా బలంగా ఉందని, సంస్థకు రూ.25-30వేల కోట్ల ఆస్తులున్నాయని తెలిపారు. టికెట్ ధరలను పెంచే ఆలోచన లేదని, ప్రైవేటీకరణ కూడా జరగదని స్పష్టం చేశారు. త్వరలోనే 2,500 ఈవీ, 500 CNG బస్సులు రానున్నాయని, అవసరమైన ఉద్యోగాలను భర్తీ చేస్తామని వెల్లడించారు.