2026 బడ్జెట్‌లో వేతన జీవులకు ఆదాయపు పన్ను తగ్గింపులో కొత్త మినహాయింపులు లేవని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే, ఐటీఆర్-1, ఐటీఆర్-2 ఫైలింగ్‌కు జూలై 31 వరకు, నాన్ ఆడిట్ బిజినెస్‌లు, ట్రస్ట్‌ల ఐటీ ఫైలింగ్‌కు ఆగస్టు 31 వరకు గడువు పెంచారు. రివైజ్డ్ ట్యాక్స్ రిటర్న్స్‌ల దాఖలు గడువు మార్చి 31కి పొడిగించారు. కొత్త ఆదాయపుపన్ను చట్టం ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి వస్తుంది. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (STT) లో మార్పులు, షేర్ల బైబ్యాక్‌లపై పన్ను, ఫారిన్ అసెట్స్ డిస్‌క్లోజర్ పథకం, ఎన్నారైల ఆస్తుల విక్రయంపై టీడీఎస్, విదేశీ టూర్ ప్యాకేజీలపై టీసీఎస్ తగ్గిం వంటి అంశాలను బడ్జెట్ ప్రతిపాదించింది.