AP:
వైసీపీ హయాంలో ఎలాంటి స్కామ్ జరగలేదని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. ‘
వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరగకపోయినా.. చంద్రబాబు రోజుకో కథ అల్లుతున్నారు. తొలుత లిక్కర్ స్కామ్ రూ.లక్ష కోట్లు అని చంద్రబాబు అన్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రూ.44 వేల కోట్లు అన్నారు. ఇప్పుడు చంద్రబాబు వేసిన సిట్ రూ.3 వేల కోట్లు అని చెబుతోంది. స్కామ్ జరగలేదు కాబట్టే.. రోజుకో అంకె చెబుతున్నారు’ అని అన్నారు.