AP: బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవికి అనర్హుడని మాజీ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. భగవద్గీతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహిళల పట్ల గౌరవం లేదని, చైర్మన్‌గా హుందాగా వ్యవహరించడంలో విఫలమయ్యారని రోజా ఆరోపించారు. ఇందాపూర్ డెయిరీకి అధిక ధరలకు నెయ్యి సరఫరా బాధ్యతలు అప్పగించడంపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు.