AP: అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వాళ్లకు తెలంగాణ భావన, తమిళనాడు వాళ్లకు తమిళ భావన ఉన్నట్లుగా, ఆంధ్రా వాళ్లకు అలాంటి భావన లేదని, 'జై ఆంధ్రా' అంటే ఇక్కడి వాళ్లు కనెక్ట్ అవ్వరని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో తనపై విరుచుకుపడుతున్న నేతల తీరుపై స్పందిస్తూ, తెలంగాణ నీ అయ్య జాగీరు కాదన్న తన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయతను రెచ్చగొట్టేలా మాట్లాడటం మానుకోవాలని సూచించారు.