నోని పండు రసంలో విటమిన్ సి, ఎ, ఇ, ఐరన్, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. నిపుణుల ప్రకారం, ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి నోని రసం బ్లడ్ షుగర్ నియంత్రణలో సహాయపడుతుంది. కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే, కిడ్నీ, కాలేయ వ్యాధులు ఉన్నవారు, గర్భిణీలు వైద్యుల సలహా తీసుకోవాలి.