భార్యను వంటగదిలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకోవడం మానసిక క్రూరత్వంగా పరిగణించాల్సిందేనని బాంబే హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఇలాంటి చర్యలు మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తాయని ధర్మాసనం పేర్కొంది. నాగ్‌పూర్‌కు చెందిన ఓ మహిళ తన భర్త తనను వంటగదిలోకి వెళ్లనివ్వడం లేదని, పుట్టింటికి కూడా పంపడం లేదని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన కోర్టు, భర్త తనను వంట చేయనివ్వకపోవడం, కదలికలపై నియంత్రణ పెట్టడం వంటి చర్యలు మానసిక వేధింపుల కిందకే వస్తాయని స్పష్టం చేసింది. అత్తపై ఆరోపణలకు ఆధారాలు లేకపోవడంతో కేసు కొట్టివేసినా, భర్తపై అభియోగాలను కొనసాగించింది.