ఓజీ కాదు.. ముందు రైతులను పట్టించుకోండి: ఎంపీ అవినాశ్ రెడ్డి

7305చూసినవారు
ఓజీ కాదు.. ముందు రైతులను పట్టించుకోండి: ఎంపీ అవినాశ్ రెడ్డి
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా టికెట్ ధరల పెంపుపై ఉన్న శ్రద్ధ కూటమి ప్రభుత్వానికి రైతులపై లేదని ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఆరోపించారు. గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారని, ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. రూ.1000కి ఓజీ సినిమా టికెట్ అమ్ముకోవడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఓజీ సినిమాపై ఉన్న శ్రద్ధను పక్కన పెట్టి.. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్