బంగాళాఖాతంలో విమానాలను అనుమతించము.. భారత్ కీలక ప్రకటన

3454చూసినవారు
బంగాళాఖాతంలో విమానాలను అనుమతించము.. భారత్ కీలక ప్రకటన
భారత్ ప్రభుత్వం బంగాళాఖాతంపై ఫిబ్రవరి 5-6 తేదీల్లో నోటమ్ (NOTAM) జారీ చేసింది. ఈ తేదీల్లో 3,190 కిలోమీటర్ల పరిధిలో విమానాలను అనుమతించబోమని ఎయిర్‌లైన్లకు తెలియజేసింది. గతంలో 2,530 కిలోమీటర్లుగా ఉన్న ఈ పరిమితిని పెంచారు. క్షిపణి పరీక్షల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సముద్ర ఆధారిత క్షిపణి పరీక్షల కోసం ఈ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు సమాచారం. అయితే, క్షిపణుల ప్రయోగంపై భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. ఆపరేషన్‌ సింధూర్‌ తర్వాత భారత్ ఆయుధాల సమీకరణ, స్వదేశీ ఆయుధాల తయారీని వేగవంతం చేసింది.

సంబంధిత పోస్ట్