ప్రముఖ రచయిత, మార్క్సిస్టు విశ్లేషకుడు, విశాఖపట్నానికి చెందిన ఆచార్య చందు సుబ్బారావు (80) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) అధ్యక్షుడిగా, ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌గా ఆయన ఎంతోమందికి సేవలందించారు. స్త్రీవాద, శాస్త్రీయ అంశాలపై ఆయన రచించిన పుస్తకాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. 1946లో తెనాలిలో జన్మించిన సుబ్బారావు, తాపీ ధర్మారావు వంటి ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.