AP: రఘురామకృష్ణరాజును సీఐడీ కస్టడీలో హింసించిన కేసులో సీఐడీ పూర్వ విభాగాధిపతి పీవీ సునీల్‌కుమార్‌కు నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసులో సునీల్‌కుమార్‌ను ఏ1గా పేర్కొన్నారు. డిసెంబర్ 4న జరిగే విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులో ఆదేశించారు. విజయనగరం ఎస్పీ దామోదర్ ఆయన్ను విచారించనున్నారు. 2021 మే 14న రాజద్రోహం కేసులో అరెస్టు చేసిన సీఐడీ అధికారులు, కస్టడీలో తనను హతమార్చేందుకు యత్నించారంటూ రఘురామకృష్ణరాజు 2024 జులై 11న గుంటూరు నగరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు.