AP: వైసీపీ అధినేత జగన్ సతీమణి వైఎస్ భారతి డైరెక్టర్‌గా ఉన్న భారతి సిమెంట్‌కు ప్రభుత్వం మరోసారి నోటీసులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా రెండు సున్నపురాయి లీజులు దక్కించుకోవడంపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ-వేలం ద్వారా మాత్రమే లీజు పొందాల్సి ఉన్నప్పటికీ.. పాత దరఖాస్తును చూపించి లీజులు దక్కించుకోవడంతో వాటిని రద్దు చేస్తామని, దీనిపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. కంపెనీ ప్రతినిధులు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇచ్చేందుకు అవకాశం కల్పించింది.