AP: రాష్ట్రవ్యాప్తంగా 301 ఓపెన్ కేటగిరి బార్ లైసెన్సులకు ఎక్సైజ్ శాఖ మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చింది. 2025-28 బార్ పాలసీ కింద మిగిలిన 301 బార్ లైసెన్సులకు రీనోటిఫికేషన్ విడుదల చేసింది. డ్రా ఆఫ్ లాట్స్ (లక్కీ డిప్) పద్ధతిలో బార్ లైసెన్సులను కేటాయించనున్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ లేదా హైబ్రిడ్ విధానాల్లో దరఖాస్తుల స్వీకరణ చేసుకోవచ్చు.