6,557 రైల్వే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

18886చూసినవారు
6,557 రైల్వే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) టెక్నీషియన్ గ్రేడ్ 1 (సిగ్నల్) 323, టెక్నీషియన్ గ్రేడ్ 3 6,234 పోస్టులతో సహా మొత్తం 6,557 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు జూన్ 30 నుండి జూలై 29 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. టెక్నీషియన్ గ్రేడ్ 1 (సిగ్నల్) పోస్టులకు 18-33 ఏళ్ల మధ్య వయస్సు, టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు 18-30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్