ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఏపీఎంఎస్ఆర్‌బీ) మంగళగిరి ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ పద్ధతిలో పలు పోస్టుల భర్తీకి బుధవారం
నోటిఫికేషన్ విడుదలైంది. వైద్య విద్యా డైరెక్టరేట్ పరిధిలోని సంస్థల్లో బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, అనాటమీ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హతగా సంబంధిత విభాగంలో పీజీ మెడికల్ డిగ్రీతో పాటు ఏపీఎంసీ నమోదు తప్పనిసరి. అభ్యర్థులు ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.