ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు విద్యాశాఖ 6,534 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 3,597 సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT), 2,937 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. SGTలకు నెలకు రూ.10 వేలు, స్కూల్ అసిస్టెంట్లకు రూ.12,500 గౌరవ వేతనం చెల్లించనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 21లోగా సంబంధిత మండల విద్యాధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు సెప్టెంబర్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు పాఠశాలల్లో బోధనా సేవలు అందించనున్నారు.